ఆసీస్ తో ఫస్ట్ టెస్ట్ కు హిట్ మ్యాన్ దూరం!
ముంబయిలోనే ప్రాక్టీస్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ
బోర్డర్ - గవస్కార్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు ఆస్ట్రేలియాకు చేరుకొని సాధన మొదలు పెట్టారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే క్రికెటర్లు విదేశీ పర్యటనకు వెళ్తుంటారు. ఈక్రమంలో ఆసీస్ టూర్ కు ఎంపిక చేసిన క్రికెటర్లంతా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ముంబయిలోనే ఉన్నాడు. నగరంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈనెల 22న ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది. వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ కు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలోనే హిట్ మ్యాన్ ఇక్కడే ఉండిపోయాడని తెలుస్తోంది. రోహిత్ త్వరలోనే టీమ్ తో జాయిన్ అవుతారని.. ఫస్ట్ టెస్ట్ కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ ఆఫీసర్ చెప్పగా.. ఫస్ట్ టెస్ట్ లోగా రోహిత్ టీమ్ తో జాయిన్ కాకుండే వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా మొదటి టెస్ట్ కు నాయకత్వం వహిస్తారని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు.