మళ్లీ వర్షం.. ఆగిపోయిన ఆట

ప్రస్తుతం భారత్‌ స్కోరు 51.5 ఓవర్లకు 180/6

Advertisement
Update:2024-12-17 10:49 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడోటెస్టులో టీమిండియా తడబాటు కొనసాగుతున్నది. 51/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. మరోసారి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (10) నిరాశపరిచాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న కేఎల్‌ రాహుల్‌ (84) కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం లంచ్‌ విరామానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 167 చేసింది. క్రీజులో రవీంద్ర (41), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (7) ఉన్నారు. లంచ్‌ అనంతరం రెండో సెషన్‌లో తొలి ఓవరన్‌ మిచెల్‌ స్టార్క్‌ వేశాడు. ఆ ఓవర్లలో రెండు ఫోర్లు కొట్టిన రవీంద్ర జడేజా 82 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశారు. 51.5 ఓవర్లకు 180/6 చేసింది. ఈ సమయంలో మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేసింది. టీమిండియా ఇంకా 265 రన్స్‌ వెనుకంజలో ఉన్నది. మొదటి ఇన్సింగ్స్‌లో 445 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News