పీవీ సింధు పెళ్లి ఫిక్స్..వరుడు ఎవరంటే?
హైదరాబాద్ స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలిపింక్ విజేత పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయితో ఆమెకు వివాహం జరుగనున్నాది. వీరి పెళ్లి డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. మ్యారేజ్‌కి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి సింధు తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు.సింధు వివాహం చేసుకోబోయే వెంకట దత్త సాయి, పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
వీరి కుటుంబాలకు ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయం ఇప్పుడు బంధుత్వంగా మారుతోంది.రెండేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తున్న పీవీ సింధు నిన్న జరిగిన జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి వు లుయో యును వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. చివరిసారిగా 2022 జులైలో సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు నిలిచింది. సింధు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో, ఆమెకు కాబోయే వధువు గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.