సచిన్‌‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించిన పీవీ సింధు జంట

కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు, సచిన్‌ టెండూల్కర్‌‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు.

Advertisement
Update:2024-12-09 13:04 IST

హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పెళ్లి రావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ సచిన్‌‌కు పీవీ సింధు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు. కాబోయే భర్తతో కలిసి సచిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి తప్పక హాజరు కావాలని సచిన్ ను కోరారు. కాగా హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ బిజినెస్ మాన్ తో పీవీ సింధు వివాహం ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో జరగనుంది.

అనంతరం 24వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారని తెలిసింది. ఈ సందర్భంగా సచిన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫొటోను షేర్‌ చేశారు. త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి రావాలని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలని సచిన్‌ ఆకాంక్షించారు.

Tags:    
Advertisement

Similar News