పెర్త్ టెస్ట్‌లో బౌలర్ల హవా.. ఒక్క రోజులో 17 వికెట్లు
85 పరుగుల ఆదిక్యంలో టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో మొదటి రోజు బౌలర్ల హవా కొనసాగింది. ఒక్క రోజులోనే బౌలర్లు 17 వికెట్లు నేలకూల్చారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా దాటికి విలవిల్లాడింది. బూమ్రా 10 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను నేలకూల్చాడు. సిరాజ్ తొమ్మిది ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా ఎనిమిది ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్లలో అలెక్స్ క్యారీ 19, మిచెల్ స్టార్క్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 83 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఆసీస్ జట్టులో మెక్ స్వీని 10, ట్రావిస్ హెడ్ 11, ఉస్మాన్ ఖవాజా 8, లబుషేన్ 2, మిచెల్ మార్ష్ 6, ప్యాట్ కమిన్స్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యారు.