డైలమాలో పాకిస్థాన్‌.. చాంపియన్స్‌ ట్రోఫీపై తొలగని ఉత్కంఠ

హైబ్రిడ్‌ మోడల్‌ కు పట్టుబడుతున్న ఐసీసీ

Advertisement
Update:2024-11-30 16:46 IST

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ఒప్పుకోవాలని, లేనిపక్షంలో టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఇప్పటికే ఐసీసీ తేల్చిచెప్పింది. శుక్రవారం (నవంబర్‌ 29న) చాంపియన్స్‌ ట్రోఫీని షెడ్యూల్‌ ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఆతిథ్యంపై డైలమా కొనసాగుతుండటంతో అది కాస్త శనివారానికి వాయిదా పడింది. ఇండియా సహా కొన్ని దేశాలు తలపడే మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఐసీసీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదే జరిగితే తమకు భారీ నష్టం వాటిల్లుతుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాక్‌ కు ఆర్థికంగా నష్టం నష్టం జరగకుండా చూడటంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ఇదివరకే ఐసీసీ ఆఫర్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌ కు చెందిన మాజీ క్రికెటర్ల సూచనతోనే పాక్‌ క్రికెట్‌ బోర్డు హైబ్రిడ్‌ మోడల్‌ కు ససేమిరా అంటోంది. మాజీల మాట వింటే మొదటికే మోసం వస్తుందని ఐసీసీ ఇదివరకే అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటందనేది కొన్ని గంటల్లోనే తేలనుంది. హైబ్రిడ్‌ మోడల్‌ కు పాక్‌ ఒప్పుకుంటే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News