విండీస్‌పై భారత్‌ విజయభేరి

మొదటి వన్డేలో 211 రన్స్‌ తేడాతో విండీస్‌ జట్టును చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌

Advertisement
Update:2024-12-22 20:19 IST

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 201తేడాతో కైవసం చేసుకొని జోరుమీదున్న భారత మహిళల జట్టు దూసుకుపోతున్నది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వడోదరలో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 211 రన్స్‌ తేడాతో విండీస్‌ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. 315 రన్స్‌ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి జట్టు కేవలం 26.2 ఓవర్లలో 103 రన్స్‌కే కుప్పకూలింది. ఫ్లెచర్‌ (24*) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు మాథ్యూస్‌ (0), జోసెఫ్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో రేణుక ఠాకూర్‌ సింగ్‌ 5 వికెట్లు పడగొట్టి విండీస్‌ జట్టును దెబ్బతీసింది . ప్రియా మిశ్రా 2, సాధు ఒక వికెట్‌ తీశారు.

 టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 రన్స్‌ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91), ప్రతీకా రావల్‌ (40), తొలి వికెట్‌కు 110 రన్స్‌ జోడించారు. అనంతరం వచ్చిన హర్లీన్‌ డియోల్‌ (44), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (34), రిచా ఘోష్‌ (26), జెమీమా రోడ్రిగ్స్‌ (31), దీప్తి శర్మ (14*) దూకుడుగా ఆడారు. విండీస్‌ బౌలర్‌ జైదా జేమ్స్‌ (5/45) ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. హీలీ మాథ్యూస్‌ 2, డాటిన్‌ ఒక వికెట్‌ తీశారు. భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు టీమిండియా అత్యధికంగా 325 రన్స్‌ చేసింది.


Tags:    
Advertisement

Similar News