లంచ్ బ్రేక్.. టీమిండియా 81/1
టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 278 రన్స్ కావాలి
రెండో టెస్ట్ లో భారత్ ముందు కివీస్ భారీ టార్గెట్ పెట్టింది. ఆ జట్టు నిర్దేశించిన 359 రన్స్ టార్గెట్ బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతున్నది. లంచ్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ కోల్పోయి 81 రన్స్ చేసింది. భారత జట్టు విజయానికి ఇంకా 278 రన్స్ కావాలి. ఓపెనర్లుగా బరిలోకి దిగిన యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ జోడి ఆరంభంలో నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అయితే టీమిండియా 34 రన్స్ వద్ద ఉండగా మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (8) ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శుభమన్ గిల్, జైశ్వాల్ ఆచితూచి ఆడుతూ ఫోర్లు, సింగిల్స్‌తో స్కోర్ బోర్డును పెంచారు. మూడోరోజు లంచ్ బ్రేక్ సమయానికి యశస్వి జైశ్వాల్ (45 నాటౌట్), గిల్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 259, భారత్ 156 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్సింగ్స్‌లో కివీస్ జట్టు 255 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
న్యూజీలాండ్ మొదటి ఇన్సింగ్స్‌లో 103 రన్స్ లీడ్ సాధించింది. నిజానికి ఆ జట్టు చేసిన స్కోర్ పెద్దదేమీ కాదు. కానీ టీమిండియా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లను చేజార్చుకున్నది. ఫలితంగా భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో నాలుగో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టమని భావించిన న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తుందా? విజయం సాధిస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. అయితే అంత ఈజీ కాదంటూనే.. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే టీమిండియాకు ఎదరయ్యాయి. అయితే స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ 300+ లక్ష్య చేధనను ఒక్కసారి మాత్రమే పూర్తి చేసింది. భారత్ వేదికగా జరిగిన టెస్టుల్లో 26 సార్లు 300 + ఎక్కువ టార్గెట్ ఛేదనకు భారత్ దిగింది. వీటిలో 14 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 9 మ్యాచ్‌లను డ్రా చేసుకున్నది. ఒకటి టైగా, మరో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో పూణె టెస్టు ఫలితంపై ఉత్కంఠ నెలకొన్నది. ఎందుకంటే ఈ టెస్టులో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు ఉంటాయి.