గెలిపించిన గిల్, జురెల్.. సిరీస్ ఇండియా కైవసం
విజయానికి ఇంక 28 పరుగులే కావల్సిన సమయంలో గిల్ గేర్ మార్చాడు. ఒకే ఓవర్‌లో రెండు సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. ఓ ఫోర్, టూ కొట్టి జురెల్ విజయ లాంఛనం పూర్తి చేశాడు.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. 192 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. నాలుగోరోజు బ్యాటింగ్‌కు దిగి ఓ దశలో 120కే 5 పరుగులు చేజార్చుకుని కష్టాల్లో పడింది. అయితే అక్కడి నుంచి జట్టును గెలిపించే బాధ్యతను గిల్, జురెల్ భుజాన వేసుకున్నారు. అజేయంగా 72 పరుగులు జోడించి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ విజయంతో టెస్ట్ సిరీస్‌ను భారత్ 3-1తో గెలుచుకుంది.
జురెల్ దూకుడు.. గిల్ సహనం
ఓ పక్క వికెట్లు పడిపోతుండటంతో గిల్ చాలా సహనంగా ఆడాడు. తన కళ్లముందే రోహిత్ శర్మ అవుటవడంతో చివరి దాకా నిలబడాల్సిన బాధ్యత గిల్‌పై పడింది. రజత్‌పటీదార్, సర్ఫరాజ్‌ఖాన్ ఇద్దరూ డకౌట్ కావడంతో జడేజా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో గిల్ మరింత పట్టుదలగా ఆడాడు. అయితే ఆ తర్వాత వచ్చిన జురెల్ ఏ మాత్రం జడవకుండా పరుగులు రాబట్టాడు.
చివర్లో ధనాధన్
విజయానికి ఇంక 28 పరుగులే కావల్సిన సమయంలో గిల్ గేర్ మార్చాడు. ఒకే ఓవర్‌లో రెండు సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. ఓ ఫోర్, టూ కొట్టి జురెల్ విజయ లాంఛనం పూర్తి చేశాడు.