బెంగళూరు టీమ్ కు భువనేశ్వర్
రూ.10.75 కోట్లకు సొంతం చేసుకున్న రాయల్ చాలెంజర్స్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను ఐపీఎల్ రెండో రోజు వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ సొంతం చేసుకుంది. రూ.10.75 కోట్లు చెల్లించి భువిని కొనుగోలు చేసింది. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ను ముంబై ఇండియన్స్ రూ.9 కోట్లు చెల్లించి దక్కించుకుంది. మరో ఫాస్ట్ బౌలర్ ముఖేశ్ కుమార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే పంజాబ్ దక్కించుకుంది. అఫ్ఘనిస్తాన్ బౌలర్ అల్లా ఘజన్‌ఫర్‌ను రూ.4.80 కోట్లకు ముంబై దక్కించుకుంది. ఫాస్ట్ బౌలర్ అన్షూల్ కాంబోజ్ ను చెన్నై రూ.3.40 కోట్లకు, అర్షద్ ఖాన్ ను రూ.1.30 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేశాయి. వెస్టిండీస్ ప్లేయర్ షెర్పేన్ రూథర్ ఫోర్డ్ ను గుజరాత్ రూ.2.60 కోట్లకు దక్కించుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ను కోల్‌కతా రూ.2.80 కోట్లకు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమానియో షెపర్డ్ ను రూ.1.50 కోట్లకు బెంగళూరు దక్కించకుంది. స్పిన్నర్ సాయికిశోర్ ను చెన్నై టీమ్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. జయదేవ్ ఉనాద్కత్‌ను హైదరాబాద్ రూ.కోటి బేస్ ప్రైస్‌కే దక్కించుకుంది.