మార్చి 22 నుంచి ఐపీఎల్.. సగం షెడ్యూలే విడుదల
మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ఇప్పుడు విడుదల చేశారు.
ధనాధన్ సిక్సులు, ఫోర్లు.. ఫటాఫట్ వికెట్లు.. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలకు వేదికగా నిలిచే దేశవాళీ టీ20 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2024కు అఫీషియల్ డేట్ వచ్చేసింది. మార్చి 22న ఈ ధనాధన్ టీ20 టోర్నీ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. ఈ మ్యాచ్‌కు చైన్నై వేదిక.
15 రోజుల షెడ్యూలే విడుదల
మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ఇప్పుడు విడుదల చేశారు. వాస్తవంగా ఐపీఎల్ దాదాపు రెండు నెలలపాటు ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను సగమే ప్రకటించారు. ఎన్నికల తేదీలను బట్టి మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేస్తారు.
ఐపీఎల్ మ్యాచ్ అంటే బందోబస్తుకు పోలీసులు, స్టేడియం, హోటల్స్ ఇవన్నీ కావాలి. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఎన్నిక ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే షెడ్యూల్ విడుదలలో ఆచితూచి అడుగులు వేస్తోంది బీసీసీఐ.