దుబాయ్ లో నేడు ఐపీఎల్-16వ సీజన్ వేలం!

ఐపీఎల్ -2024 సీజన్ వేలానికి దుబాయ్ లో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 333 మంది ప్లేయర్ల నుంచి 77 మందిని వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి.

Advertisement
Update:2023-12-19 14:02 IST

ఐపీఎల్ -2024 సీజన్ వేలానికి దుబాయ్ లో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 333 మంది ప్లేయర్ల నుంచి 77 మందిని వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి.

దుబాయ్ వేదికగా ఈరోజు జరిగే ఐపీఎల్ -2024 సీజన్ మినీ వేలం ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 10 ఫ్రాంచైజీ యాజమాన్యాలు 200 కోట్ల రూపాయల మొత్తంతో వేలం బరిలో నిలువనున్నాయి.

కేవలం 77 స్థానాల భర్తీ కోసమే ప్రస్తుత సీజన్ వేలం నిర్వహిస్తున్నారు.

విదేశీ ప్లేయర్ల కోసం 30 స్థానాలు...

మినీ వేలం జాబితాలోని మొత్తం 333 మంది ప్లేయర్లలో భారత్ కు చెందిన 214మంది సైతం ఉన్నారు. విదేశీ ప్లేయర్ల జాబితాలో 30 స్థానాల కోసం 119 మంది పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు అసోసియేట్ సభ్యదేశాలకు చెందినవారూ ఉన్నారు.

మొత్తం ఆటగాళ్లలో 116 మంది అంతర్జాతీయ, 215 మంది దేశవాళీ అనుభవం ఉన్నవారు వేలం బరిలో నిలువనున్నారు.

23 మంది ఆటగాళ్ల కనీస వేలం ధర 2 కోట్ల రూపాయల నుంచి, 13 మంది ధర కోటీ50 లక్షల రూపాయల నుంచి ప్రారంభంకానుంది.

రచిన్, స్టార్క్, హెడ్ లకు డిమాండ్...

విదేశీక్రికెటర్ల కోటాలో ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, న్యూజిలాండ్ యంగ్ గన్ రచిన్ రవీంద్ర, కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ల కోసం వివిధ ఫ్రాంచైజీలు ప్రధానంగా పోటీపడనున్నాయి.

ఇప్పటి వరకూ విదేశీ క్రికెటర్లలో సామ్ కరెన్ అత్యధికంగా దక్కించుకొన్న 18 కోట్ల 50 లక్షల రూపాయల ధరను నేటి వేలంలో మిషెల్ స్టార్క్ అధిగమించే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్ 38 కోట్ల 15 లక్షల రూపాయల మొత్తంతోనూ, సన్ రైజర్స్ హైదరాబాద్ 34 కోట్ల రూపాయలు, కోల్ కతా నైట్ రైడర్స్ 32.7 కోట్ల రూపాయలు, చెన్నై సూపర్ కింగ్స్ 31.4 కోట్లు, పంజాబ్ కింగ్ 29.1 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 28.95 కోట్లు, రాయల్ చాలెంజర్స్ 23.25 కోట్లు, ముంబై ఇండియన్స్ 17 కోట్ల 75 లక్షలు, రాజస్థాన్ రాయల్స్ 14 కోట్ల 50 లక్షలు, లక్నో సూపర్ జెయింట్స్ 13 కోట్ల 15 లక్షల రూపాయల మొత్తంతో వేలంలో పాల్గోనున్నాయి.

ఈ రోజు జరిగే వేలం కార్యక్రమాన్ని తొలిసారిగా ఓ మహిళా ఆక్షనీర్ ( మల్లికా సాగర్ )తో నిర్వహించనుండడం విశేషం.

ఈ మినీ వేలం లో జాక్ పాట్ ఎవరు కొడతారో?...రికార్డు ధరను ఎవరు దక్కించుకొంటారో? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News