మూడో వన్డేలోనూ భారత్ పరాజయం..ఆసీస్ క్లీన్ స్వీప్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 ఆసీస్ తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో పస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (110) శతకంతో విజృంభించింది.. ఆష్లే గార్డ్‌నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన (105) సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధన ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ కూప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో గార్డ్‌నర్ 5 వికెట్లు తీసింది.