భారత్ ను ఊరిస్తున్న వన్డే టాప్ ర్యాంక్!

ఈరోజు న్యూజిలాండ్ తో జరిగే ఆఖరివన్డేలో సైతం భారత్ నెగ్గితే టాప్ ర్యాంక్ అందుకోగలుగుతుంది.

Advertisement
Update:2023-01-24 11:45 IST

భారత్ ను ఊరిస్తున్న వన్డే టాప్ ర్యాంక్!

వైట్ బాల్ క్రికెట్లో భారత్ ను మరో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఊరిస్తోంది. ఈరోజు న్యూజిలాండ్ తో జరిగే ఆఖరివన్డేలో సైతం భారత్ నెగ్గితే టాప్ ర్యాంక్ అందుకోగలుగుతుంది.

టీ-20 ఫార్మాట్లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత్ ను..50 ఓవర్ల వన్డే క్రికెట్లో సైతం టాప్ ర్యాంక్ ఊరిస్తోంది. న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను 3-0తో నెగ్గితే భారత్ టాప్ ర్యాంకర్ గా నిలువగలుగుతుంది.

2023 సీజన్లో టాప్ గేర్..

భారత్ వేదికగా జరిగే ఐసీసీ 2023 వన్డే ప్రపంచకప్ కు ఆతిథ్యదేశం హోదాలో 4వ ర్యాంక్ జట్టుగా సన్నాహాలు మొదలు పెట్టిన భారతజట్టు..ప్రస్తుత సీజన్ తొలిసిరీస్ లో శ్రీలంకను 3-0తో చిత్తు చేసింది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ న్యూజిలాండ్ తో తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండువన్డేలు నెగ్గడం ద్వారా తన ర్యాంక్ ను 3వ స్థానానికి మెరుగుపరచుకోగలిగింది.

హైదరాబాద్, రాయ్ పూర్ వన్డేలలో భారత్ చేతిలో ఓటమి పొందడంతో ఇప్పటి వరకూ టాప్ ర్యాంక్ లో ఉన్న న్యూజిలాండ్ రెండోర్యాంక్ కు పడిపోయింది. ఇంగ్లండ్ టాప్ ర్యాంక్ చేరుకోగా..భారత్ 4 నుంచి మూడోర్యాంక్ లో నిలిచింది.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ ఏస్థాయిలో రాణించగలదన్న దానిపైనా ర్యాంకింగ్స్ ఆధారపడి ఉన్నాయి.

ఆడిన గత ఐదు వన్డేలలో ఐదు వరుస విజయాలు సాధించిన భారత్ 113 పాయింట్లతో నిలిచింది. టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ కంటే ఒక్కపాయింటు మాత్రమే వెనుకబడి ఉంది. న్యూజిలాండ్ తో ఆఖరివన్డేలో సైతం నెగ్గితే భారత్ టాప్ ర్యాంక్ ను చేరుకోగలుగుతుంది.

మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ చాన్స్!

భారతజట్టు ఇదే జోరు కొనసాగించగలిగితే..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచే అవకాశం ఉందని మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ చెబుతున్నాడు. మ‌రికొద్ది రోజుల్లోనే వ‌న్డే, టీ20, టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకు సొంతం చేసుకుంటుంద‌ని , వ‌న్డేల్లో భార‌త్ క‌చ్చితంగా నంబ‌ర్ 1 ర్యాంక్‌కు చేరుకోగలదని ధీమాగా చెప్పాడు.

ప్ర‌స్తుతం భార‌త్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై మూడో వ‌న్డేలో గెలిస్తే నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. టాప్‌లో ఉన్న న్యూజిలాండ్ రెండు వ‌న్డేల్లో ఓట‌ముల‌తో రెండో ర్యాంకుకు ప‌డిపోయింది. ప్ర‌స్తుతం టీ20 పురుషుల జ‌ట్టు ర్యాకింగ్స్‌లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో ప్లేస్‌లో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News