అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో నిరాశపరిచిన భారత్
డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ పోరులో యువ భారత్ 59 రన్స్ తేడాతో ఓటమి
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ పోరులో యువ భారత్ 59 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 49.1 ఓవర్లలో 198 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 35.2 ఓవర్లలో 139 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్లు ఆయుష్ (1), వైభవ్ (9), నిరాశపరిచారు. మహ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కార్తికేయ (21), సిద్ధార్థ్ (20) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ 40, రిజన్ హొసన్ 47, ఫరీద్ హసన్ 39 రన్స్ చేశారు. భారత బౌలర్లలో యుధజిత్ గుహ, చేతన్ శర్మ, హర్దిక్ రాజ్, తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చొర్మాలే, కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు.