పాండ్యా విడాకులు నిజమే.. ఇవిగో ఆధారాలు
హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది. ఈనెల రోజుల్లో జరిగిన కొన్ని సందర్భాలను పరిశీలిస్తే పాండ్యా దంపతుల మధ్య ఏం జరుగుతోందో ఇట్టే అర్థం అవుతుంది.
మ్యాటర్లోకి వెళ్తే.. 17ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. గెలుపులో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతమైన సంఘటన గురించి పాండ్యా భార్య నుంచి ఒక్క ప్రశంస కూడా లేదు. వరల్డ్ కప్ మ్యాచ్లు చూసేందుకు కూడా ఆమె రాలేదు. పాండ్యా కూడా కూతురుతోనే ప్రపంచ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. నేనేం చేసినా కేవలం నీ ఒక్కదాని కోసమే అని పోస్టు పెట్టాడు. ఫోటోల్లో, వీడియోల్లో ఎక్కడా భార్య నటాషా కనిపించలేదు.
మొన్న అంబానీ కొడుకు పెళ్లి వేడుకలకు సైతం పాండ్యా ఒక్కడే వచ్చాడు. ఫోటోలుకు ఫోజులిస్తూ బయటకి నవ్వుతున్నా.. హార్ధిక్ కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపించింది. తాజాగా పాండ్యా భార్య రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దేవుడు మన సమస్యల్ని తీర్చడు. కానీ ఓ దారి చూపిస్తాడంటూ బై చెప్పింది. దీంతో వీరి విడాకులు నిజమే అనే చర్చ జరుగుతోంది.
మే 31, 2020లో పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ పెళ్లి జరిగింది. హిందూ, క్రైస్తవ పద్ధతిలో వీళ్లు వివాహం చేసుకున్నారు. ఇద్దరికి అగస్త్య అనే పాప ఉంది. కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో నటాషా స్టాంకోవిచ్ తన పేరు నుంచి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించిడంతో విడాకుల అంశం తెరపైకి వచ్చింది.