గోల్స్‌ కాదు కనక వర్షం కురిపిస్తదట!

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియం ఆధునీకరణతో ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం

Advertisement
Update:2024-09-24 15:52 IST

ఫుట్‌ బాల్ స్టేడియంలో గోల్స్‌ అభిమానులను కేరింతలు కొట్టిస్తాయి. కానీ ఆ ఫుట్‌ బాల్‌ స్టేడియం గోల్స్‌ కాదు కనక వర్షం కురిపించబోతుందట? అది ఎక్కడ అనుకుంటున్నారా.. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లో.. అవును బ్రిటన్‌ కు ఓ ఫుట్‌ బాల్‌ స్టేడియం కాసుల వర్షం కురిపించబోతోంది. బ్రిటన్‌ లోని గ్రేటర్‌ మాంచెస్టర్‌ లో గల ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ గ్రౌండ్‌, దాని సమీప ప్రాంతాల ఆధునీకరణపై ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ స్టడీ చేసి ఒక ఫీజిబులిటీ రిపోర్ట్‌ అందజేసింది. దాని ఆధారంగా మాంచెస్టర్‌ యునైటెడ్‌ కో ఓనర్‌ జిమ్‌ రాట్‌ క్లిఫ్‌ రెండు బిలియన్‌ డాలర్లతో కొత్త స్టేడియం నిర్మించారు. ఇందులో లక్ష సీటింగ్‌ కెపాసిటీ కల్పించారు. పాత స్టేడియంను ఆధునికరించే పనులు మొదలు పెట్టారు. అందులో 74 వేల సీటింగ్‌ కెపాసిటీ కల్పించనున్నారు. వీటితో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇతర ఎమినిటీస్‌ కల్పిస్తున్నారు. ఈ ఒక్క ప్రయత్నంతో కొత్తగా 92 వేల ఉద్యోగాల కల్పనతో పాటు 17 వేల కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడుతారని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రేటర్‌ మాంచెస్టర్‌ రూపురేఖలు మారిపోతాయని, పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News