ప్రపంచకప్ నుంచి జర్మనీ, బెల్జియం అవుట్!

ఫిఫా ప్రపంచకప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ రెండోర్యాంకర్ బెల్జియం, నాలుగుసార్లు విశ్వవిజేత జర్మనీ గ్రూప్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాయి.

Advertisement
Update:2022-12-02 11:57 IST

ప్రపంచకప్ నుంచి జర్మనీ, బెల్జియం అవుట్!

ఫిఫా ప్రపంచకప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ రెండోర్యాంకర్ బెల్జియం, నాలుగుసార్లు విశ్వవిజేత జర్మనీ గ్రూప్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాయి.

ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ గ్రూపులీగ్ దశలో సంచలనాల వెల్లువ కొనసాగుతోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీ, ప్రపంచ రెండోర్యాంకర్ బెల్జియం జట్ల పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది.

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు!

ప్రపంచకప్ ఫుట్ బాల్ బరిలోకి హాట్ ఫేవరెట్ జట్లుగా దిగిన రెండోర్యాంకర్ బెల్జియం, నాలుగుసార్లు విజేత జర్మనీల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రూప్ -ఎఫ్ నుంచి

ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరాలంటే క్రొయేషియాపైన నెగ్గితీరాల్సిన ఆఖరిరౌండ్ పోటీలో రెండోర్యాంకర్ బెల్జియం చతికిల పడిపోయింది. పోటీని 0-0తో డ్రాగా ముగించడం ద్వారా నిష్క్రమించక తప్పలేదు.

గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో జరిగిన ఈ పోరులో బెల్జియం నాలుగుమార్పులతో విజయమే లక్ష్యంగా పోటీకి దిగింది. అయితే..గోల్ కోసం, గెలుపు కోసం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. క్రొయేషియా డిఫెండర్లు ఎక్కడికక్కడే బెల్జియంకు పగ్గాలు వేయగలిగారు. ఆట రెండో భాగంలో గోల్ చేయటానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. రోమేలు లూకాకు గోలు చేయటంలో విఫలమయ్యాడు.

ఆట నిర్ణితసమయంలో ఏజట్టు గోలు చేయకపోడంతో పోటీ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ను డ్రాగా ముగించిన క్రొయేషియా 5 పాయింట్లతో గ్రూప్ రన్నరప్ గా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది. ఆఫ్రికా సంచలనం ట్యునీసియా 7 పాయింట్లతో టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్లో అడుగుపెట్టింది.

గ్రూపులో మూడు, నాలుగుస్థానాలలో నిలిచిన బెల్జియం, కెనడా టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు.

గ్రూప్-ఈ నుంచి జర్మనీ ఫట్..

స్పెయిన్, జపాన్, కోస్టారికాలతో కూడిన గ్రూప్- ఈ లీగ్ లో మాజీ చాంపియన్ జర్మనీ మూడు పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా మూడోస్థానానికి పడిపోయింది. మూడురౌండ్లలో ఒక్కో గెలుపు, ఓటమి, డ్రా ఫలితాలు సాధించిన జర్మనీ..గోల్స్ సగటున స్పెయిన్ కంటే వెనుకబడిపోయి..లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

స్పెయిన్, జర్మనీజట్లు చెరో మూడుపాయింట్లు సాధించినా..గోల్స్ సగటున స్పెయిన్ కే నాకౌట్ బెర్త్ ఖాయమయ్యింది.

దీంతో గ్రూప్ దశ నుంచే జర్మనీతో పాటు కోస్టారికా సైతం ఇంటిదారి పట్టక తప్పలేదు.

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే బ్రెజిల్ తర్వాత నాలుగు టైటిల్స్ తో అత్యంత విజయవంతమైనజట్టుగా నిలిచిన జర్మనీకి ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీ ఓ పీడకలగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News