చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఉబ్జెకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప వ్యక్తిగత వాల్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలుగ రికార్డు నెలకొల్పింది.

Advertisement
Update:2024-05-27 13:44 IST

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఉబ్జెకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప వ్యక్తిగత వాల్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలుగ రికార్డు నెలకొల్పింది. డోపింగ్‌ ఆరోపణలతో 21 నెలల పాటు సస్పెన్షన్‌ ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో రికార్డులలోకి ఎక్కింది.

ఆదివారం జరిగిన ఫైనల్లో మొత్తం 8 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొనగా అసాధారణ ప్రదర్శనతో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. దీప సగటున 13.566 స్కోర్ చేసింది.

దీప తరువాత 13.466 స్కోర్ తో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ హయాంగ్ , 12.966 స్కోర్ తో జో క్యోంగ్ బ్యోల్ లు రజత మరియు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. గతంలో 2015లో హిరోషిమాలో జరిగిన 14.725 స్కోర్ తో కాంస్యం నెగ్గిన తర్వాత ఛాంపియన్‌షిప్‌లో దీపాకు ఇది రెండో పతకం. అంతకు ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.

 

గతంలో 2015 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆశిష్ కుమార్ వ్యక్తిగత ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రణతి నాయక్ 2019 మరియు 2022 ఎడిషన్‌లలో వాల్ట్ ఈవెంట్‌లో ఒక్కో కాంస్యం సాధించింది. అయితే వీరెవరు బంగారు పతాకాన్ని సాధించలేదు.

ఒలింపిక్స్‌లో పాల్లొన్న భార‌త తొలి మ‌హిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీప‌.. ఆ త‌ర్వాత డోప్ ప‌రీక్ష‌లో ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. డోపింగ్ కారణంగా 21 నెలల సస్పెన్షన్ తర్వాత ఈ పోటీలో పాల్గొన్నప్పటికీ తను రానున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు.

Tags:    
Advertisement

Similar News