పాక్‌ గడ్డపై క్రికెట్‌ ఆడేది లేదు

చాంపియన్స్‌ ట్రోఫీపై తేల్చేసిన బీసీసీఐ

Advertisement
Update:2024-11-09 19:37 IST

పాకిస్థాన్‌ గడ్డపై టీమిండియా క్రికెట్‌ ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా నిర్వహించే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని తటస్థ వేదికపై నిర్వహించకుంటే తాము పాల్గొనబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. చాంపియన్స్‌ ట్రోఫి వేదిక మార్చేది లేదని ఐసీసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యం భారత వైఖరిపై బీసీసీఐ శనివారం క్లారిటీ ఇచ్చింది. పాక్‌ గడ్డపై ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్‌ లు ఆడబోమని చెప్పిన ఇండియా ఇకపై పాక్‌ వేదికగా నిర్వహించే ఐసీసీ టోర్నీల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేసింది. 2023లో ఆసియా కప్‌ టోర్నీ సమయంలో పాక్‌ గడ్డపై ఆడేందుకు భారత్‌ నిరాకరించింది. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. భారత్‌ ఆడే మ్యాచ్‌లను మరో వేదికపై నిర్వహిస్తే తాము చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటామని, లేదంటే మొత్తానికే టోర్నీకి దూరంగా ఉంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News