ఒక్కో బంతీ ఒక్కో బుల్లెట్.. డాట్ బాల్స్‌తో బుమ్రా రికార్డ్
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు బుమ్రా మొత్తం 383 బంతులు వేస్తే అందులో 268 బాల్స్ డాట్ బాల్సే. అతను బ్యాట్స్‌మన్‌పై తెస్తున్న ఆ ఒత్తిడి షమి, జడ్డూ లాంటి బౌలర్లకు వికెట్లు తీయడానికి ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా లేడు. అంతెందుకు మన బౌలర్లలో కూడా బుమ్రా టాప్ కాదు. కానీ బుమ్రా బంతికి బ్యాట్స్‌మన్లు వణికిపోతున్నారు. బుల్లెట్‌లా దూసుకొచ్చే అతని బంతులను ఆడలేక చేతులెత్తేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 268 బంతుల్లో బుమ్రా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదంటే అతని బౌలింగ్ ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది.
పరుగుల జాతరలోనూ అతని బంతులకు గౌరవమే
ఈ ప్రపంచకప్‌లో 300, 400 పరుగులు నమోదైన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. ప్రతి బౌలర్‌నూ బ్యాట్స్‌మన్లు నిర్దాక్షిణ్యంగా ఆడేస్తున్నారు. కానీ ఇండియా వరకు వచ్చేసరికి అంత ఫ్రీగా ఆడలేకపోతున్నారు. షమీ, సిరాజ్, జడేజా లాంటి బౌలర్లు వికెట్ల మీద వికెట్లు తీసేస్తున్నారు. దీనికి వెనకున్న ప్రధాన కారణం బుమ్రా బౌలింగ్‌లో పడుతున్న కష్టమే. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు బుమ్రా మొత్తం 383 బంతులు వేస్తే అందులో 268 బాల్స్ డాట్ బాల్సే. అతను బ్యాట్స్‌మన్‌పై తెస్తున్న ఆ ఒత్తిడి షమి, జడ్డూ లాంటి బౌలర్లకు వికెట్లు తీయడానికి ఎంతో ఉపయోగపడుతోంది.
యావరేజ్‌లో టాపర్
బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్స్‌మన్‌ను కట్టిపడేస్తున్న బుమ్రా యావరేజ్‌లోనూ తోపే. కనీసం 20 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్లలో అతనే టాప్. బుమ్రా సరాసరిన ఓవర్‌కు ఇచ్చిన పరుగులు 3.64. బుమ్రా తర్వాత ఈ వరల్డ్‌కప్‌లో సరాసరిన ఓవర్‌కు నాలుగు కంటే తక్కువ పరుగులు ఇచ్చింది మన జడ్డూ మాత్రమే. అతని యావరేజ్ 3.76.
పవర్ ప్లేలో బుమ్రా విధ్వంసం
ఇక పవర్ ప్లేలో బుమ్రా బీభత్సమే చేస్తున్నాడు. పవర్ ప్లేలో అతను ఇచ్చిన యావరేజ్ రన్స్ జస్ట్ 2.73. సిక్సులు, ఫోర్లు వరదలా పోటెత్తే పవర్ ప్లేలో ఓవర్‌కు3 పరుగులు కూడా ఇవ్వని బుమ్రా మన బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఇరుసులా మారి బౌలర్లను ముందుకు నడిపిస్తున్నాడు.