వంద పరుగులు దాటిన ఆసీస్ ఆదిక్యం
ట్రావిస్ హెడ్ సెంచరీ.. ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
Advertisement
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వంద పరుగులకు పైగా ఆదిక్యం సాధించింది. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో టీమ్ స్కోర్‌లో కీలకంగా నిలిచాడు. హెడ్ 132 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 121 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా 80 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. శనివారం ఉదయమే బూమ్రా రెండు వికెట్లు నేలకూల్చగా, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాపై 111 పరుగుల ఆదిక్యంలో ఉంది.
Advertisement