సిడ్నీ టెస్టులో ఆసీస్‌ ఘ‌న విజ‌యం..డబ్ల్యూటీసీ నుండి భారత్ ఔట్‌

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Advertisement
Update:2025-01-05 10:48 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో బీజీటీ సిరీస్‌ను ఆసీస్ కైవ‌సం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్‌లో 141/6 మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మ‌రో 16 ప‌రుగులు మాత్ర‌మే జోడించి ఆలౌట్ అయింది. మొద‌టి ఇన్నింగ్స్ లో 4 రన్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఆసీస్‌కు 162 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఇక‌ 162 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయ‌క‌పోవ‌డం టీమిండియాను ఎదురుదెబ్బ తగిలింది. కంగారులు ఇన్నింగ్స్ లో ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా 41, వెబ్‌స్ట‌ర్ 39 (నాటౌట్‌), ట్రావిస్ హెడ్ 34 (నాటౌట్‌), సామ్ కొన్‌స్టాస్ 22 ప‌రుగులు చేశారు.

భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మ‌హ్మ‌ద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఇక ఈ టెస్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఆసీస్ బౌల‌ర్ స్కాట్ బోలాండ్ (10 వికెట్లు తీశాడు)కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. సిరీస్ ఆసాంతం రాణించిన జ‌స్ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. ఐదు టెస్టుల్లో క‌లిపి అత‌డు 32 వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో పాటు 42 ప‌రుగులు చేశాడు. సిడ్నీటెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయంతో…. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది ఆసీస్‌. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు గల్లంతు అయ్యాయి. దీంతో… డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆడే ఛాన్సులు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News