అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ రిటైర్మెంట్
అన్ని ఫార్మాట్లు క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికారు
Advertisement
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లుకూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆయన్ను భారత జట్టులో గొప్ప ఆల్ రౌండర్‌గా పేర్కొంది. టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. అతను 106 టెస్టుల్లో 24 యావరేజ్‌లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు . కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ప్రకటన చేశాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement