సెంచరీతో చెలరేగిన అశ్విన్..భారత్ స్కోర్ 339/6

చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది.

Advertisement
Update: 2024-09-20 00:57 GMT

బంగ్లాదేశ్‌తో ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమాయనికి టీమ్ ఇండియా 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగారు. కేవలం 108 బంతుల్లో వంద పరుగులు సాధించారు. ఇక భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 56, రోహిత్ శర్మ 6, శుభ్‌మాన్ గిల్ 0, విరాట్ కోహ్లీ 6, రిషబ్ పంత్ 39, కేఎల్ రాహుల్ 16 చొప్పున రన్స్ చేసి ఔటయ్యాడు.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో జత కట్టి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆట ముగిసే సమయానికి అశ్విన్ 102 పరుగులు, రవీంద్ర జడేజా 86 చొప్పు క్రీజులో నాటౌట్‌‌గా ఉన్నారు. చెన్నైలో అశ్విన్‌కు ఇది సెంకడ్ సెంచరీ. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ల నిరాశపరిచారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికే భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 6 పరుగుల వద్ద హసన్ మహమూద్‌కు ఔటయ్యాడు. విరాట్ కోహ్లి కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.

Tags:    
Advertisement

Similar News