కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్

అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లాడు.

Advertisement
Update:2024-10-17 17:29 IST

అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ గాయపడ్డాడు.. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లాడు. రిషభ్ ప్లేస్‌లో ధృవ్ జురెల్ కీపింగ్‌కు వచ్చారు.వికెట్ కీపింగ్ చేస్తుండగా బంతి నేరుగా అతని మోకాలికి తగలడంతో పంత్ కుప్పకూలాడు. సర్జరీ అయిన చోటే బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా లాభం లేకపోయింది. దాంతో వారి భుజాలపై చేతులు వేసి అతి కష్టంగా పంత్ మైదానం వీడాడు. పంత్ పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రిషభ్ పంత్‌కు గాయం తీవ్రం అయితే సెకండ్ ఇన్నింగ్‌కి దూరమైనట్లే .దీంతో భారత్ బ్యాటింగ్‌కు మైనస్ .

కివిస్‌తో మొదటి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో అనూహ్య రీతిలో 46 పరుగులకే కుప్పకూలింది.పిచ్ పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 41 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(17 బ్యాటింగ్), డారిల్ మిచెల్(4 బ్యాటింగ్) ఉన్నారు. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డెవాన్ కాన్వే(91), విల్ యంగ్(33) రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేలా తలో వికెట్ తీసారు.ఈ ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. సొంతగడ్డపై భారత్‌కు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. 37 ఏళ్ల నాటి ఈ చెత్త రికార్డును టీమిండియా క్రాస్ చేసింది. ఇక విదేశాల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 36 పరుగులు. 2020లో ఆసీస్ పర్యటన సందర్భంగా టీమిండియా అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మరోసారి 50 పరుగుల లోపే ఆలౌట్ కావడం మళ్లీ ఈరోజు జరిగింది.

Tags:    
Advertisement

Similar News