337 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
నాలుగేసి వికెట్లు పడగొట్టిన బూమ్రా, సిరాజ్
Advertisement
అడిలైడ్ పింక్ బాల్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 86 పరుగుల వద్ద శనివారం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, నాలుగు సిక్సులతో 140 పరుగులు చేయగా, లబుషేన్ 64, మెక్‌స్వీని 39 రన్స్ చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అశ్విన్, నితీశ్ కు ఒక్కో వికెట్ దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా 157 పరుగుల ఆదిక్యం సాధించింది.
Advertisement