13 ఏళ్ల చిన్నోడికి రూ.1.10 కోట్లు!

వైభవ్‌ సూర్యవంశీని దక్కించుకున్న రాజస్థాన్‌

Advertisement
Update:2024-11-25 21:59 IST

13 ఏళ్ల చిన్నోడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్శించాడు. రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌తో ఐపీఎల్‌ వేలంలో నిలిచిన ఆ చిన్నోడిని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఏకంగా రూ.1.10 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ ఏడాదే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో అడుగు పెట్టిన బీహార్‌ చిన్నోడు వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్‌గా దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ రాణించే సత్తా ఉన్నవాడు. అందుకే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఐదు మ్యాచ్‌ లే ఆడిన సూర్యవంశీని తమ టీమ్‌ లో రాజస్ధాన్‌ భాగం చేసుకుంది. బీహార్‌లోని తాజ్‌పూర్‌ కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ నాలుగేళ్ల పసిప్రాయంలోనే క్రికెట్‌ పై ఆసక్తి కనబరిచాడు. ఆయన తండ్రి సమస్తిపూర్‌ లోని అకాడమీలో చేర్పించి క్రికెట్‌ లో శిక్షణ ఇప్పించాడు. పదేళ్ల వయసులోనే అండర్‌ -16 జట్టులో చోటు దక్కించుకున్నాడు వైభవ్‌.

Tags:    
Advertisement

Similar News