ఆసీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ లో నితీశ్‌ ఎంట్రీ!

రోహిత్‌ రెస్ట్‌, గిల్‌ కు గాయంతో తెలుగు ప్లేయర్‌ కు చాన్స్‌?

Advertisement
Update:2024-11-17 17:47 IST
ఆసీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ లో నితీశ్‌ ఎంట్రీ!
  • whatsapp icon

ఆస్ట్రేలియాతో ఈనెల 22న ప్రారంభమయ్యే బోర్డర్‌ గవాస్కర్‌ ఫస్ట్‌ టెస్ట్‌ లో తెలుగు ప్లేయర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితిక రెండు రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌ టెస్ట్‌ కు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ గాయంతో ఫస్ట్‌ టెస్ట్‌ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్‌ బూమ్రా కెప్టెన్సీలో ఆసీస్‌ తో తలపడే టీమ్‌ లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి టెస్ట్‌ క్రికెట్‌ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇండియా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా దాదాపు ఇదే ఒపీనియన్‌ తో ఉందని సమాచారం. ధ్రువ్‌ జురేల్‌ కు కూడా ఫస్ట్‌ టెస్ట్‌ ఫైనల్‌ టీమ్‌ లో చోటు దక్కవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. రోహిత్‌ ఆసీస్‌ కు చేరుకోకపోవడం, శుభ్‌మన్‌ గిల్‌ వేలు విరిగినట్టుగా ఎక్స్‌ రేలో తేలడంతో నితీశ్ తో పాటు జురేల్‌ కు చోటు దక్కవచ్చని తెలుస్తోంది. విరాట్‌ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్‌, కేఎల్‌ రాహుల్‌ ను సైతం గాయాలు వేధిస్తున్నాయి. ఈనెల 22 నాటికి వాళ్లు పూర్తి ఫిట్‌ నెస్‌ సాధించి ఫైనల్‌ టీమ్‌ లోకి వస్తారా? కుర్రాళ్లతోనే ఆసీస్‌ ను యంగ్‌ ఇండియా ఫస్ట్‌ టెస్ట్‌ లో ఢీకొట్టబోతుందా అంటే తేలేందుకు మ్యాచ్‌ తేదీ వరకు వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News