బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారత్‌ 376 రన్స్‌కు ఆలౌట్‌

బంగ్లా బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ ధాటికి అగ్రశ్రేణ బ్యాటర్లు చేతులెత్తేయగా..ఆల్‌రౌండర్లు రవిచంద్ర అశ్విన్‌, రవీంద్ర జడేజాలు భారత్‌ను ఆదుకుని సురక్షిత స్థితికి చేర్చారు.

Advertisement
Update:2024-09-20 12:09 IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటి ఇన్సింగ్స్‌లో టీమిండియా 376 రన్స్‌కు ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (113), జడేజా (86), యశస్వి జైస్వాల్‌ (56), రిషబ్‌ పంత్‌ ( 39) పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్‌ మహ్మద్‌ 5, తస్కిన్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీశారు.

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్ట్‌ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలి రోజు సగం వరకు బంగ్లా బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి భారత బ్యాటర్లను ఆత్మరక్షణలోకి నెట్టారు. ముఖ్యంగా బంగ్లా బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ ధాటికి అగ్రశ్రేణ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి స్పెల్‌లో 5-2-6-3 గణాంకాలతో అతను టీమిండియా టాప్‌ఆర్డర్‌ను కకావికలం చేశాడు. దీంతో భారత్‌ 34 రన్స్‌కే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితి లో ఓపెన్‌ యశస్వీ జైస్వాల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఆచితూచి ఆడి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దారు. యశస్వీ జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తున్నాడు. పంత్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చాక కేఎల్‌ రాహుల్‌ గ్రౌండ్‌లో ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. యశస్వీని యువ పేసర్‌ నహిద్‌ పెవిలియన్‌ చేర్చితే రాహుల్‌ను స్పిన్నర్‌ మెహిదీ మిరాజ్‌ ఔట్‌ చేశారు. దీంతో భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 144 రన్స్‌ చేసి మళ్లీ ఇబ్బందుల్లో పడింది.ఈ సమయంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రవిచంద్ర అశ్విన్‌, రవీంద్ర జడేజాలు భారత్‌ను ఆదుకుని సురక్షిత స్థితికి చేర్చారు. ఈ జోడి అసాధారణ రీతిలో బ్యాటింగ్‌ చేయడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేయగలిగింది.

రవిచంద్రన్ అశ్విన్‌కి హోంగ్రౌండ్ కావడం, రవీంద్ర జడేజా సీఎస్కే టీమ్‌ సభ్యుడు కావడంతో ఈ పిచ్ మీద ఎలా ఆడాలో ఇద్దరికీ అర్థం అయ్యింది. వీళ్లిద్దరూ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్రతి బాల్‌కు ఫ్యాన్స్ అరుపులు మామూలుగా లేవు.‌ మొత్తానికి ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్‌ ఆడి టీమ్ఇండియాను రక్షించారు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది ఆరో టెస్టు సెంచరీ కాగా..‌హోం గ్రౌండ్‌లో రెండోది కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News