వాట్సాప్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?
Whatsapp tricks and tips: మెసేజింగ్ నుంచి కమ్యూనిటీస్ వరకూ రకరకాల ఫీచర్లుండే వాట్సాప్‌లో ఇంకా బోలెడు ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు మనదేశంలో దాదాపు యాభై కోట్లమంది యూజర్లు ఉన్నారు. పర్సనల్ మెసేజింగ్ నుంచి కమ్యూనిటీస్ వరకూ రకరకాల ఫీచర్లుండే వాట్సాప్‌లో ఇంకా బోలెడు ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి..
వాట్సప్‌లో మెసేజ్‌ల సంగతి పక్కన పెడితే ఎవరెవరు ఏయే స్టేటస్‌లు పెట్టారోనని చూస్తుంటారు చాలామంది. అయితే స్టేటస్‌లు చూసేటప్పుడు అది కొంతసేపు వరకే కనిపిస్తుంటుంది. ఎక్కువసేపు చూడాలంటే దాని మీద నొక్కి పట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా స్టేటస్ అలాగే పాజ్ అయ్యి కనిపించాలంటే స్క్రీన్ మీద మూడు వేళ్లతో ఒకేసారి టచ్ చేస్తే చాలు.
స్టేటస్ పెట్టినప్పుడు దాని మీద ట్యాప్ చేస్తే ఎవరెవరు, ఎప్పుడు చూశారో తెలుస్తుంది. అలా అవతలి వాళ్లు.. వాళ్ల స్టేటస్‌ను ఎవరెవరు చూశారో తెలుసుకోవచ్చు. అయితే ఒకవేళ ఆయా స్టేటస్‌లను మనం చూసినట్టు అవతలి వాళ్లకు తెలియకూడదనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్‌లో రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
కొత్త నెంబర్‌కు వాట్సాప్‌లో ఏదైనా పంపాల్సి వస్తే.. ముందు ఆ నంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సేవ్ చేసుకోకుండా మెసేజ్ పంపాలనుకుంటే ఈ ట్రిక్ వాడొచ్చు. ముందుగా ఆ కొత్త నంబర్‌ను కాపీ చేసుకుని వాట్సప్‌లో సెల్ఫ్-ఛాట్ ఆప్షన్‌లో పేస్ట్ చేసుకోవాలి. అక్కడ మెసేజ్ పంపి, తర్వాత ఆ మెసేజ్‌లోని నంబరు మీద క్లిక్ చేస్తే.. ఛాట్ విత్, కాల్ ఆన్ వాట్సప్, యాడ్ టు కాంటాక్ట్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో ఛాట్ విత్‌ను ఎంచుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్.