అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

పోఖ్రాన్‌ 1,2 పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ రాజగోపాల చిదంబరం

Advertisement
Update:2025-01-04 11:24 IST

ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.ఈ మేరకు అణు ఇంధన శాఖ ప్రకటన విడుదల చేసింది. పోఖ్రాన్‌ న్యూక్లియర్‌ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం.. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్‌ 1, 1998 నిర్వహించిన పోఖ్రాన్‌ 2 అణుపరీక్షల్లో కీలకంగా పనిచేశారు. బాబా ఆటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) డైరెక్టర్‌గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ సేవలందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 199లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 

Tags:    
Advertisement

Similar News