అమెరికాలో టిక్‌టాక్ సేవలు బంద్
జనవరి 19 నుంచి అమల్లోకి రానున్ననిషేధం
అమెరికాలో టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన తన సర్వీసులను బంద్ చేస్తున్నట్లు మెసేజ్‌లు జారీ చేస్తున్నది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ నేషనల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. 'అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడానికి తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నది. దీంతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం' అంటూ టిక్‌టాక్ తన యూజర్లకు మెసేజ్ పంపింది. అయితే యాప్ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుందని చెబుతున్నది. దీనిపై నిషేధం జనవరి 19 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనాకు చెందిన ఈ యాప్‌ను అమెరికా యాప్‌స్టోర్లు తొలిగిస్తున్నట్లు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
2017లో ప్రారంభమైన టిక్ టాక్ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించిన విషయం వదితిమే. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలూ దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనన్నది ఆ బిల్లులోని సారాంశం. తర్వాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌కు డెడ్‌లైన్ ఇచ్చింది. జనవరి 19లోగా యూఎస్ టిక్‌టాక్‌ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? నిర్ణయించుకోవాలని హెచ్చించింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీజింగ్‌పై కఠిన ఆంక్షలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ సేవల్ని బంద్ చేస్తున్నట్లు సంస్థ యూజర్లకు సమాచారం అందించింది.