రిటైర్మెంట్ వయసు పెంచిన కాగ్నిజెంట్
58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు
Advertisement
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాగ్నిజెంట్ తమ సంస్థలోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచింది. ప్రస్తుతం 58 ఏళ్లు ఉన్న రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచింది. ఇండియాలో కాగ్నిజెంట్ సంస్థలో 2.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈమేరకు సంస్థ హెచ్‌ఆర్ వింగ్ నుంచి ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అనుభవజ్ఞులైన సీనియర్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకే రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచినట్టు తెలుస్తోంది.
Advertisement