వికాస్‌ ఇంజిన్‌ రీస్టార్ట్‌ డెమో విజయవంతం

వివిధ దశల్లో ఇంజిన్‌ రిస్టార్ట్‌ను ధృవీకరించుకోవడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తున్న ఇస్రో

Advertisement
Update:2025-01-18 11:10 IST

అంతరిక్ష రంగంలో ఇస్రో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకువెళ్తున్నది. తాజాగా వికాస్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ రిస్టార్ట్‌ చేసే డెమోను విజయవంతంగా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లోని టెస్ట్‌ ఫెసిలిటీలో దీనిని చేపట్టింది. ఈ మేరకు శనివారం ఇస్రో వెల్లడించింది.

వివిధ దశల్లో ఇంజిన్‌ రిస్టార్ట్‌ను ధృవీకరించుకోవడానికి ఇస్రో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. తాజాగా 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించి.. 120 సెకన్ల పాటు షట్‌ ఆఫ్‌ చేసింది. తర్వాత రీస్టార్ట్‌ చేసి, ఏడు సెకన్ల పాటు మండించింది. ఈ ప్రక్రియలో ఇంజిన్‌లోని అన్ని పారామీటర్లు సాధారణంగా, ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో ప్రకటించింది. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించడానికి చేస్తున్న పరీక్షల్లో ఇదొక సానుకూల పరిణామం. రాకెట్‌లో ద్రవ ఇంధన దశలో వికాస్‌ ఇంజిన్‌లో ఉంటుంది. 

Tags:    
Advertisement

Similar News