వాతావరణ శాస్త్రాలలో పురోగతి వస్తోంది
భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని వ్యాఖ్యలు
Advertisement
భూకంపాల హెచ్చరికల వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ దిశలో పనిచేయాలని ప్రధాని మోడీ సూచించారు. వాతావరణ శాస్త్రాలలో పురోగతి వల్ల ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి కలిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడిందని గుర్తుచేశారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఏర్పడి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గత 150 ఏళ్లలో ఐఎండీ కోట్లాదిమంది భారతీయులకు సేవ చేయడమే కాకుండా శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా ఉన్నదని ప్రధాని కొనియాడారు. భారత వాతావరణ శాఖ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనున్నది.
Advertisement