మార్కెట్‌లోకి యాపిల్ ఫస్ట్ ఫోల్డుబల్ ఫోన్ ఎప్పుడంటే?
ఐఫోన్ 18 తో ఈ ఫోల్డబుల్ మొబైల్ తీసుకొచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నటెక్ వర్గాలు
యాపిల్ తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్తగా ఏ ప్రొడెక్ట్ తీసుకురానున్నది? వాటిలో ఏయే కొత్త ఫీచర్లు జోడించనున్నది? అని ఆరా తీస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్ నడుస్తున్నది. ఇప్పటికే పలు సంస్థలు ఈ విభాగంలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటున్నాయి. ఇక యాపిల్ కూడా ఈవిభాగంలో ఎంట్రీ ఇవ్వనున్నదనంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికలతో ఆ ఎదురుచూపులకు తెరపడే అవకాశం ఉన్నదని సమాచారం
ఇప్పటికే కృత్రిమ మేధను అందిపుచ్చుకున్న యాపిల్.. తాజాగా ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కొత్తగా రెండు ఫోల్డబుల్ డివైజులపై పనిచేస్తున్నది సమాచారం. క్లామ్ షెల్ స్టైల్ ఐఫోన్, 20 అంగుళాల ఫోల్డబుల్ ఐప్యాడ్‌తో ఫోల్డబుల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నదని టెక్ వర్గాల సమాచారం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ప్లిప్, మొటోరోలా రేర్జ్ లాగా క్లామ్ షెల్ డిజైన్‌తో యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ రానున్నదని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కంటే పెద్ద స్క్రీన్‌తో దీన్ని తీసుకురానున్నారట. అంటే 7 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఐప్యాడ్‌ను 20 అంగులాళ డిస్‌ప్లేతో రానున్నది.
ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో శాంసంగ్, హువామే, మోటోరొలా.. హవా కొనసాగుతోంది. త్వరలో వీటికి పోటీగా ఐఫోన్ రానున్నది. 2026 యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే అవకాశం ఉన్నదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐఫోన్ 18 తో ఈ ఫోల్డబుల్ మొబైల్ తీసుకొచ్చే అవకాశం ఉన్నదని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.