వాట్సాప్‌ కాల్స్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. లేటెస్ట్‌గా కొన్ని కొత్త కాలింగ్ ఫీఛర్లను పరిచయం చేసింది.

Advertisement
Update:2024-06-16 21:17 IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. లేటెస్ట్‌గా కొన్ని కొత్త కాలింగ్ ఫీఛర్లను పరిచయం చేసింది. యూజర్లకు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉండే ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే.

మెసేజింగ్ కోసమే కాకుండా కాలింగ్ కోసం కూడా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారు చాలామంది. నెట్‌వర్క్‌తో పనిలేకుండా ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు వాట్సాప్ ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నవారితో కాల్స్ మాట్లాడాలంటే వాట్సాప్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్. అందుకే కాలింగ్ ఫీచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వాట్సాప్. తాజాగా మూడు మేజర్ కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటంటే..

స్క్రీన్ షేరింగ్

వాట్సాప్‌లో కాల్స్ మాట్లాడేటప్పుడు ఆడియోతో కూడిన స్క్రీన్ షేరింగ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ను ఎనేబుల్ చేసింది. కాల్‌లో ఉండగా మీ స్క్రీన్‌ను ఆడియోతో సహా ఇతరులకు షేర్ చేయొచ్చు. గ్రూప్ కాల్స్‌కు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ ఆడియో కాల్స్, గ్రూపు కాల్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు ఈ ఫీచర్ తెచ్చినట్టు వాట్సాప్ చెప్తోంది.

గ్రూప్ వీడియో కాల్స్

వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేసుకునే వారికోసం మెంబర్స్ సంఖ్యను పెంచుతూ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇకపై వీడియో కాల్‌లో గరిష్టంగా 32 మంది పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఒకే కాల్‌లో ఎక్కువ మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనవచ్చు. లేదా ఎక్కువమంది కలిసి ఆఫీస్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు.

స్పీకర్ స్పాట్‌లైట్

వాట్సాప్ గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు వీలుగా స్పీకర్ స్పాట్‌లైట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. కాల్‌లో ఉన్నప్పుడు.. ప్రస్తుతం మాట్లాడుతున్న వ్యక్తి ఐకాన్ ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతుంది.

బెటర్ క్వాలిటీ

వాట్సాప్ కాల్స్‌లో ఆడియో, వీడియో క్వాలిటీని మెరుగుపరుస్తూ వాట్సాప్ కొన్ని అప్‌డేట్స్ చేసింది. నాయిస్ క్యాన్సిలేషన్, హై క్వాలిటీ ఆడియో వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. సిగ్నల్ తక్కువగా ఉన్నా, చుట్టూ నాయిస్ ఉన్నా.. కాల్స్ స్పష్టంగా వినిపించేందుకు ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీని బట్టి హెచ్‌డీ వీడియో కాల్స్ కూడా చేసుకునేలా వాట్సాప్ సెట్టింగ్స్ అప్‌డేట్ చేసింది.

Tags:    
Advertisement

Similar News