ఇ–సిమ్ గురించి తెలుసా?
మొబైల్స్‌లో వాడే సిమ్ కార్డుల గురించి మనకు తెలుసు. అయితే త్వరలోనే ఇలాంటి సిమ్ కార్డులకు గుడ్ బై చెప్పబోతున్నాయి నెట్‌వర్క్ కంపెనీలు. ఫిజికల్ సిమ్ కార్డుకు బదులు ఎలక్ట్రానిక్ సిమ్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాయి. దీన్నే ఇ–సిమ్ అంటారు.
మొబైల్స్‌లో వాడే సిమ్ కార్డుల గురించి మనకు తెలుసు. అయితే త్వరలోనే ఇలాంటి సిమ్ కార్డులకు గుడ్ బై చెప్పబోతున్నాయి నెట్‌వర్క్ కంపెనీలు. ఫిజికల్ సిమ్ కార్డుకు బదులు ఎలక్ట్రానిక్ సిమ్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాయి. దీన్నే ఇ–సిమ్ అంటారు. దీని ప్రత్యేకతలేంటంటే..
సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు త్ మొబైల్ తయారీ కంపెనీలు, నెట్‌వర్క్ కంపెనీలు కలిసి ఎలక్ట్రానిక్ సిమ్ టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఇ–సిమ్ అందుబాటులోకి వస్తే.. మొబైల్‌లోని సిమ్ స్లాట్‌లో సిమ్ కార్డు ఉంచాల్సిన అవసరంలేదు. ఎంచుకున్న నెట్‌వర్క్‌కు మీ మొబైల్ డివైజ్ నేరుగా కనెక్ట్ అయిపోతుంది. ఎలక్టానిక్ సిమ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయా నెట్‌వర్క్ ఆపరేటర్ అవుట్‌లెట్‌లకు వెళ్లి మొబైల్ ఫోన్‌తో సబ్‌స్క్రైబ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇక ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోవడం, ప్లాన్స్ వేసుకోవడం అంతా మామూలే. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు ఇ–సిమ్ సర్వీసులను ఇప్పటికే అందిస్తున్నాయి. అయితే ఇ–సిమ్ సేవలు పొందాలంటే మొబైల్ ఫోన్.. ఇ–సిమ్‌ను సపోర్ట్ చేసేదై ఉండాలి. ప్రస్తుతం యాపిల్ ఫోన్లతో పాటు శాంసంగ్, గూగుల్, మోటొరోలా బ్రాండ్స్‌కు చెందిన కొన్ని మోడల్స్ ఇ–సిమ్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాదు, మొబైల్స్‌తో పాటు కొన్ని స్మార్ట్ వాచీల్లో కూడా ఇ–సిమ్ ఫీచర్ ఉంది. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు, శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లలో ఈ ఫీచర్ ఇప్పటికే పనిచేస్తుంది.
ఇ–సిమ్ వల్ల స్విమ్ స్వాప్ ద్వారా జరిగే సైబర్ నేరాలు తగ్గుతాయని నెట్‌వర్క్ కంపెనీలు చెప్తున్నాయి. సెక్యూరిటీ, సిగ్నల్ రిసీవింగ్ పరంగా కూడా ఇ–సిమ్‌తో లాభాలున్నాయి. అయితే ఇ–సిమ్ వాడేవాళ్లు మొబైల్‌ను మార్చిన ప్రతీసారీ నెట్‌వర్క్ ఆపరేటర్ అవుట్‌లెట్‌కు వెళ్లి సిమ్ రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.