Vivo X Fold 3 Pro | భార‌త్ మార్కెట్‌లోకి వివో ఫ‌స్ట్ ఫోల్డ‌బుల్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Vivo X Fold 3 Pro | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో ఎక్స్ ఫోల్డ్‌3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోల్డ‌బుల్ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-06-07 10:30 IST

Vivo X Fold 3 Pro | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో ఎక్స్ ఫోల్డ్‌3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోల్డ‌బుల్ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. భార‌త్ మార్కెట్‌లో వివో ఆవిష్క‌రించిన తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ ఇది. చైనా మార్కెట్‌లో గ‌త ఏప్రిల్ నుంచి వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్ అందుబాటులో ఉంది. జైసీస్ బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరా (Zeiss-branded triple rear cameras)ల‌తోపాటు స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ (Snapdragon 8 Gen 3 SoC) ప్రాసెస‌ర్‌తో వ‌స్తోందీ ఫోన్‌. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ( Vivo X Fold 3 Pro) ఫోన్ 8.03- అంగుళాల అమోలెడ్ ఇన్న‌ర్ స్క్రీన్ క‌లిగి ఉంటుంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,59,999 ప‌లుకుతుంది. సెలెస్టియ‌ల్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో ల‌భిస్తుంది. వివో ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ల్లో ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 13 నుంచి సేల్స్ మొద‌ల‌వుతాయి.

ఇంట్ర‌డ్యూస‌రీ ఆఫ‌ర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్బీఐ కార్డుల‌పై కొనుగోలు చేసే వారికి రూ. 15 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తోంది. అద‌నంగా రూ.10 వేల వ‌ర‌కూ ఎక్స్చేంజ్ బోన‌స్ అందిస్తున్న‌ది. వ‌న్‌టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉంట‌ది. నెల‌వారీగా రూ.6,666 ఈఎంపైతో 24 నెల‌ల వ‌రకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్లు ఉన్నాయి. దీంతోపాటు వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో ఈ నెల 17 నుంచి వివో వైర్‌లెస్ చార్జ‌ర్ 2.0 ల‌భిస్తుంది.

భార‌త్‌తోపాటు అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో వివో ఆవిష్క‌రించిన తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో (Vivo X Fold 3 Pro). ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open), టెక్నో ఫాంటోమ్ వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold) ఫోన్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 14 విత్ ఫన్‌ట‌చ్ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. హెచ్‌డీఆర్ 10, డోల్బీ విజ‌న్ మ‌ద్ద‌తుతో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 8.03 అంగుళాల ప్రైమ‌రీ 2కే (2,200x2,480 పిక్సెల్స్‌) రిజొల్యూష‌న్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 6.53 అంగుళాల (1,172x2,748 పిక్సెల్స్‌) అమోలెడ్ క‌వ‌ర్ డిస్‌ప్లే క‌లిగి ఉంట‌ది. రెండు స్క్రీన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌కు మ‌ద్ద‌తుగా ఉంటాయి. మెయిన్ స్క్రీన్ 91.77 శాతం, క‌వ‌ర్ స్క్రీన్ 90.92 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో క‌లిగి ఉంటాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోన్ ఒక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్‌తో ప‌ని చేస్తుంది. 12 ఏండ్ల పాటు రోజూ 100 సార్లు ఫోల్డ్ చేసేందుకు వీలుగా కార్బ‌న్ ఫిబ్రే హింగ్ ఫీచ‌ర్‌తో డిజైన్ చేశారు. బ్యాక్‌లో గ్లాస్ ఫైబ‌ర్‌, ఫ్రంట్‌లో గ్లాస్‌తో త‌యారు చేశారు. ఫోన్ మ‌ధ్య‌లో అల్యూమినియం అల్లాయ్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు. జైసీస్ బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న వివో ఎక్స్ ఫోల్డ్ 3 ఫోన్‌లో ఓఐఎస్ మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 64 మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్స‌ర్ విత్ 3ఎక్స్ జూమింగ్‌, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్స‌ర్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరాల‌తో క‌వ‌ర్ స్క్రీన్ డిజైన్ చేశారు. వివో వీ3 ఇమేజింగ్ చిప్‌తో రూపుదిద్దుకున్న‌దీ ఫోన్‌.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్ 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, బైదూ, గ్లోనాస్‌, గెలీలియో, క్యూజ‌డ్ఎస్ఎస్‌, న‌వ్ ఐసీ, ఏ-జీపీఎస్‌, ఓటీజీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రో మీట‌ర్‌, అంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ఫ్లిక‌ర్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, గైరో, ఎల‌క్ట్రానిక్ కంపాస్‌, క‌ల‌ర్ టెంప‌రేచ‌ర్ సెన్స‌ర్‌, లేస‌ర్ ఫోక‌స్ సెన్స‌ర్‌, ఎయిర్ ప్రెష‌ర్ సెన్స‌ర్‌, మ‌ల్టీ స్పెక్ట్ర‌ల్ సెన్స‌ర్‌, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్ట‌ర్ త‌దిత‌ర సెన్స‌ర్లు ఉంటాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటాయి. ఐపీ ఎక్స్‌8 రేటింగ్ ఫ‌ర్ డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ క‌లిగి ఉంది. 100 వాట్ల వైర్డ్‌, 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5700 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల లిథియం బ్యాట‌రీతో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ప‌ని చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News