Vivo T3x 5G | వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ రూ.13,499 నుంచి షురూ..!
Vivo T3x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Vivo T3x 5G| ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. న్యూ వివో టీ సిరీస్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ తో వస్తోంది. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్న వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. వచ్చే వారంలో న్యూ వివో టీ3ఎక్స్ 5జీ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,499, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,499లకు అందుబాటులో ఉంటుంది. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ (Vivo T3x 5G) సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిష్ షేడ్స్‌లో లభిస్తుంది. ఈ నెల 24 నుంచి వివో అఫిషియల్ ఆన్‌లైన్ స్టోర్, ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్, దేశంలోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం అవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది వివో.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్‌రేట్, 393పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1080x2,408 పిక్సెల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ర్యామ్ 3.0 ఫీచర్ పొగిగింపులో భాగంగా వర్చువల్‌గా ర్యామ్ మరో 8జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ విస్తరించవచ్చు.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/2.05 అపెర్చర్ కలిగి ఉంటుంది. గతేడాది మార్కెట్‌లో ఆవిష్కరించిన వివో టీ2ఎక్స్ 5జీ (Vivo T2x 5G) ఫోన్‌లో వాడిన కెమెరా సెటప్ కూడా ఇందులో వాడారు.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఓటీజీ, బైదూ, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తోపాటు యాక్సెలరో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్న వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వివో టీ3ఎక్స్ 5జీ పోన్ వస్తుంది. బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 68 గంటల ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం బ్యాటరీ లైఫ్ ఉంటది.