Poco F6 5G | క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో పోకో ఎఫ్6 5జీ.. 23న భారత్ మార్కెట్‌లో ఆవిష్కరణ..!
Poco F6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో తన పొకో ఎఫ్6 5జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది.
Poco F6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో తన పొకో ఎఫ్6 5జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శక్తి సామర్థ్యాలతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుందీ ఫోన్. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి. ఈ నెల 23న భారత్ మార్కెట్‌లో ఆవిష్కరిస్తామని ప్రకటించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీతో రూపుదిద్దుకున్న ఫోన్ పోకో ఎఫ్6 5జీ ఫోన్ మొదటిది. న్యూ ఎన్ఎం ఒక్టాకోర్ చిప్‌సెట్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నట్లు క్వాల్‌కామ్ ధృవీకరించింది.
ఇప్పటి వరకు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో గ్లోబల్ మార్కెట్‌లో మోటరోలా, షియోమీ, రియల్‌మీ సంస్థలు స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించాయి. రియల్‌మీ జీటీ నియో6 (Realme GT Neo 6), రెడ్‌మీ టర్బో3 (Redmi Turbo 3), మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra), ఐక్యూ జడ్9 టర్బో (iQoo Z9 Turbo), షియోమీ సివి 4 ప్రో (Xiaomi Civi 4 Pro) ఫోన్లలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్ వినియోగించారు.
చైనా మార్కెట్‌లో గతనెలలో ఆవిష్కరించిన రెడ్‌మీ టర్బో3 (Redmi Turbo 3) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పొకో ఎఫ్6 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారని తెలిపింది. ఈ ఫోన్ ధర సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు) పలుకుతుందని పేర్కొంది. గూగుల్ జెమినీ నానో, ల్లామా 2, బైచువాన్ -7బీ వంటి 30కి పైగా ఆన్ డివైజ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లకు ఈ ఫోన్ మద్దతుగా నిలుస్తుందీ ఫోన్.
పొకో ఎఫ్6 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్‌రేటుతోపాటు 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.5 కే (1,220x2,712 పిక్సెల్స్) రిజొల్యూషన్ ఓలెడ్ డిస్‌ప్లే, 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సర్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్.