OnePlus Open | సోనీ ల్వైటియా కెమెరాతో వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఓపెన్‌..!

OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ `వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2023-10-21 17:10 IST

OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ `వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. సోనీ నెక్స్ జ‌న‌రేష‌న్.. ఎల్‌వైటీఐఏ-టీ808 (LYTIA-T808) పిక్సెల్ స్టాక్డ్‌ సీఎంఓఎస్ సెన్స‌ర్ కెమెరాతో వ‌చ్చిందీ వ‌న్ ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open). క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌తోపాటు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో 7.82 అంగుళాల అమోలెడ్ ఇన్న‌ర్ డిస్‌ప్లే, 6.31 అంగుళాల ఔట‌ర్ స్క్రీన్ ప్యానెల్‌ క‌లిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రెండు సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. 67 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తుంది.

16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తున్న వ‌న్ ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఫోన్ రూ.1,39,999ల‌కు ల‌భిస్తుంది. ఎమ‌రాల్డ్ డ‌స్క్‌, వోయాగ‌ర్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తోంది. వ‌న్‌ప్ల‌స్ వెబ్‌సైట్‌, అమెజాన్‌, దేశంలోని ఇత‌ర రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ప్రీ-ఆర్డ‌ర్లు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27 నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. సెలెక్టెడ్ డివైజ్‌పై రూ.8,000 ట్రేడ్ ఇన్ బోన‌స్‌, ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ వ‌న్ కార్డ్ ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అద‌నంగా రూ.5000 ల‌భిస్తుంది.

అమెరికా మార్కెట్లో వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) 1,699 డాల‌ర్లు (రూ.1,41,300) ప‌లుకుతుంది. వ‌న్‌ప్ల‌స్ డాట్ కామ్‌, అమెజాన్‌, బెస్ట్ బై ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో ఉంటుంది. యూర‌ప్‌లో 1799 యూరోలు (రూ.1,58,100) ప‌లుకుతుంది. యూర‌ప్ మార్కెట్‌లో ఈ నెల 26 నుంచి వ‌న్‌ప్ల‌స్ డాట్ కామ్ ద్వారా సొంతం చేసుకోవ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 13.2 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 7.82 అంగుళాల (2,268x2,440 పిక్సెల్స్‌) 2కే ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ ఎల్‌టీపీవో 3.0 అమోలెడ్ డిస్‌ప్లే విత్ 1-120 హెర్ట్జ్ డైన‌మిక్ రీఫ్రెష్ రేట్‌, 240 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 2800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంట‌ది.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఔట‌ర్ స్క్రీన్ 6.31 అంగుళాల (1,116x2,484 పిక్సెల్స్‌) 2కే ఎల్‌టీపీఓ 3.0 సూప‌ర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే విత్ 10-120 హెర్ట్జ్ డైన‌మిక్ రీఫ్రెష్ రేట్‌, 240 హెర్ట్జ్ ట‌చ్ రెస్పాన్స్ రేట్- 2,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ హసెల్‌బ్లేడ్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. 48-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ 1/1.43-అంగుళాల సోనీ ఎల్‌వైటీ-టీ808 పిక్సెల్ స్టాక్డ్‌ సీఎంఓఎస్ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), ఎల‌క్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఈఐఎస్‌), 85-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ ఎఫ్‌/1.7 అపెర్చ‌ర్ క‌లిగి ఉంటుంది.

ఓమ్నీ విజ‌న్ ఓవీ64బీ సెన్స‌ర్ విత్ ఓఐఎస్‌, ఈఐఎస్‌, 33.4 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతోపాటు 64మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంట‌ది. ఇది 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 6 ఎక్స్ ఇన్ సెన్స‌ర్ జూమ్ అప్‌టూ 120 ఎక్స్ డిజిట‌ల్ జూమ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది. 48-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 81 సెన్స‌ర్ (Sony IMX581) విత్ ఈఐఎస్‌, 114-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్ క‌లిగి ఉంటుంది.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ ఇన్న‌ర్ డిస్‌ప్లేలో 20-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా విత్ ఈఐఎస్‌, 91-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్ క‌లిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో చాట్స్ కోసం ఔట‌ర్ స్క్రీన్‌పై ఈఐఎస్‌తోపాటు 88.5 ఫీల్డ్ ఆఫ్ వ్యూ 32-మెగా పిక్సెల్స్ కెమెరా క‌లిగి ఉంటుంది.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ 512 జీబీతోపాటు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వ‌స్తుంది. ఈ ఫోన్ 5జీ, 4 జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, ఎన్ఎఫ్‌సీ, బైడూ, జీపీఎస్‌, గ్లోనాస్‌, గేలిలియో, క్యూజ‌డ్ఎస్ఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ విత్ యూఎస్బీ 3.1 క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెలెరో మీట‌ర్‌, గైరోస్కోప్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, సెన్స‌ర్ కోర్‌, ఈ-కంపాస్‌, ఫ్లిక్ డిటెక్స్ సెన్స‌ర్‌, అండ‌ర్ స్క్రీన్ ఆంబియెంట్ లైట్ సెన్స‌ర్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ ఉంటాయి. ఇత‌ర ఫ్లాగ్‌షిప్ వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌లో మాదిరిగా ట్రై-స్టేట్ అల‌ర్ట్ స్లైడ‌ర్ కూడ ఉంది. 67 వాట్ల సూప‌ర్ వూక్ చార్జ‌ర్ మ‌ద్ద‌తుతో డ్యుయ‌ల్ సెల్ 4800 (3295+1510 ఎంఏహెచ్‌) కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌తోపాటు బాక్స్‌లో 80వాట్ల చార్జ‌ర్ వ‌స్తుంది.

Tags:    
Advertisement

Similar News