త్వరలోనే వన్‌ప్లస్ 13 రిలీజ్! ఫీచర్లు ఇవే..
వన్‌ప్లస్ 12 మొబైల్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 13 త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అనౌన్స్‌మెంట్‌కు ముందునుంచే ఈ మొబైల్ ఫీచర్లపై టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఆండ్రాయిడ్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్స్‌లో వన్‌ప్లస్ కూడా ఒకటి. మిడ్‌రేంజ్ మొబైల్స్‌ను పక్కనపెడితే ఫ్లాగ్‌షిప్ క్యాటగిరీలో వన్‌ప్లస్ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడా సిరీస్‌లో లేటెస్ట్‌గా ‘వన్‌ప్లస్ 13’ మొబైల్ లాంఛ్‌కు రెడీ అయింది. ఈ మొబైల్ ప్రత్యేకతలేంటంటే..
వన్‌ప్లస్ 12 మొబైల్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 13 త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అనౌన్స్‌మెంట్‌కు ముందునుంచే ఈ మొబైల్ ఫీచర్లపై టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 13 ఫోన్.. 6.8 ఇంచెస్ మైక్రో కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో రాబోతోందట. 2కె రిజల్యూషన్ కలిగిన ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 13 మొబైల్ లేటెస్ట్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆక్సిజన్ యూఐపై రన్ అవుతుంది. అలాగే ఈ మొబైల్‌లో ముందువైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోపాటు వెనుక మరో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలుంటాయి. ఇందులో ఒకటి హాసల్‌బ్లేడ్ సెన్సర్ ఉండొచ్చు. అలాగే ఈ కెమెరాకు మల్టీఫోకల్, పెరిస్కోప్ జూమ్ వంటి లెటెస్ట్ ఫీచర్లుండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 13 ఫోన్‌లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 65 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్‌తో పాటు ఎన్‌ఎఫ్ సీ, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్, యూఎఫ్ ఎస్ 4.0 వంటి ఫీచర్లున్నాయి. 256 జీబీ, 1టీబీ స్టోరేజీ వేరియంట్లు ఉండొచ్చు. ధర సుమారు రూ. 65,000 వరకూ ఉండొచ్చు.