ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలు ఇవే..
Google Year In Search 2022: గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022' లిస్ట్ ప్రకారం ఇండియాలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ పదం 'క్రికెట్'. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ జరగడంతో ఈ ఏడాది 'క్రికెట్' పదం సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2022 కి గుడ్ బై చెప్పి 2023కి వెల్‌కమ్ చెప్పడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే 2022 ఏడాది మనందరికీ ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. వాటిని మరోసారి రీక్యాప్ చేసుకోవాలంటే ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన రిజల్ట్స్ చూస్తే సరిపోతుంది.
గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022' లిస్ట్ ప్రకారం ఇండియాలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ పదం 'క్రికెట్'. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ జరగడంతో ఈ ఏడాది 'క్రికెట్' పదం సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. దాని తర్వాత 'ఫిఫా' ప్రపంచ కప్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ రెండు పదాలు టాప్ 5 సెర్చ్ లిస్ట్‌లో ఉన్నాయి.
సినిమాల పరంగా చూస్తే ఎక్కువ సెర్చ్ చేసిన సినిమా పేరు 'బ్రహ్మాస్త్ర'. ఆ తర్వాత రెండో స్థానంలో 'కేజీఎఫ్ ఛాప్టర్-2' ఉంది. వీటి తర్వాత ఆర్ఆర్ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్, లాల్ సింగ్ చడ్డా, దృశ్యం 2, పుష్ప: ది రైజ్, కాంతారా, విక్రమ్, థార్: లవ్ అండ్ థండర్ సినిమాలు టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉన్నాయి.
ఇకపోతే 'వాట్ ఈజ్ (What is)' అనే విభాగంలో భారత సైన్యం తీసుకొచ్చిన 'అగ్నిపథ్ స్కీమ్' గురించి ఎక్కువమంది గూగుల్‌లో వెతికారు. అలాగే నాటో, ఆర్టికల్ 370, మెటావర్స్, కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, థియేటర్, స్విమ్మింగ్ ఫూల్, వాటర్ పార్క్ లాంటి పదాలను కూడా ఎక్కువగానే సెర్చ్ చేశారు.
వ్యక్తుల గురించి వెతికిన జాబితాలో బీజేపీ మాజీ లీడర్ నుపూర్ శర్మ పేరు మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సుస్మితా సేన్, అబ్దు రోజిక్, అంబర్ హెర్డ్ పేర్లు ఉన్నాయి. ఈవెంట్స్ పరంగా రష్యా-ఉక్రెయిన్ వార్ టాప్ సెర్చ్‌గా ఉంది. ఫుడ్ విషయానికొస్తే పనీర్ పసందా, మలై కోఫ్తా, పనీర్ భుర్జీ, చికెన్ సూప్, పాన్ కేక్ పదాలను ఎక్కువగా వెతికారు.