గూగుల్ సెర్చ్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?

గూగుల్ సెర్చ్ బార్‌‌లో కొన్ని కోడ్స్ టైప్ చేయడం ద్వారా మరింత స్పష్టమైన రిజల్ట్స్ పొందొచ్చని మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం ద్వారా బెటర్ సెర్చ్ రిజల్ట్స్ పొందొచ్చు.

Advertisement
Update:2024-05-23 07:45 IST

ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా లేదా ఏదైనా డౌట్ వచ్చినా మొదట అడిగేది గూగుల్ నే. ప్రతిఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే గూగుల్‌లో మీరు మరింత మెరుగైన ఇన్ఫర్మేషన్ పొందాలంటే సెర్చ్ స్మార్ట్‌గా చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గూగుల్ సెర్చ్ బార్‌‌లో కొన్ని కోడ్స్ టైప్ చేయడం ద్వారా మరింత స్పష్టమైన రిజల్ట్స్ పొందొచ్చని మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం ద్వారా బెటర్ సెర్చ్ రిజల్ట్స్ పొందొచ్చు. అదెలాగంటే..

గూగుల్ సెర్చ్ బార్‌‌లో డబుల్ కొటేషన్ మార్క్స్(“ ”) వాడి సెర్చ్ చేయడం ద్వారా స్పష్టమైన రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకు ‘బెస్ట్ ఫ్యామిలీ వెకేషన్స్ ఇన్ ఇండియా’ అని టైప్ చేస్తే రకరకాల సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అదే బెస్ట్ “ఫ్యామిలీ” వెకేషన్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే.. ఫ్యామిలీ అన్న పదం ఉన్న సైట్స్ మాత్రమే కనిపిస్తాయి.

ఏదైనా సైట్‌లో ఉండే వివరాలను సెర్చ్ చేయడం కోసం ‘ సైట్: ’ అనే కోడ్ వాడొచ్చు. ఉదాహరణకు డయాబెటిస్ గురించి డబ్ల్యూహెచ్‌ఓలో పబ్లిష్ అయిన వివరాలు మాత్రమే కావాలనుకుంటే ‘ site: who.int diabetes ’ అని సెర్చ్ చేస్తే ఆ సైట్‌లో డయాబెటిస్ పేరుతో ఉన్న వివరాలన్ని కనిపిస్తాయి.

గూగుల్‌లో ఫైల్ టైప్స్‌ను బట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకు ‘ ఫొటో ఎడిటింగ్ ట్యూటోరియల్’ అని టైప్ చేస్తే రకరకాల రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదా పీడియఫ్ లాంటివే కావాలనుకుంటే సెర్చ్ చివర్లో ‘filetype: ppt’ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మాత్రమే కనిపిస్తాయి.

ఒక టాపిక్ గురించి పూర్తిగా ఎలా రిసెర్చ్ చేయాలో తెలియనప్పుడు‘ * ’ సింబల్‌తో సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకు ‘ the * of money ’ అని టైప్ చేస్తే.. డబ్బుకి సంబంధించిన రకరకాల టాపిక్స్.. అంటే డెఫినీషన్ ఆఫ్ మనీ, సైకాలజీ ఆఫ్ మనీ, సోర్సెస్ ఆఫ్ మనీ, టైప్స్ ఆఫ్ మనీ.. ఇలా భిన్నమైన రిజల్ట్స్ వస్తాయి.

గూగుల్‌లో ఫొటోలను గుర్తించేందుకు లెన్స్‌ సాయం తీసుకోవచ్చు. ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫొటోలను గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు సెర్చ్ రిజల్ట్స్ రూపంలో వస్తాయి.

ఇకపోతే గూగుల్ సెర్చ్‌లో మరికొన్ని అడ్వాన్స్డ్‌ టూల్‌ కూడా ఉన్నాయి. భాష, ఫైల్‌ టైప్, సైజ్, పోస్ట్ చేసిన తేదీ.. ఇలా టూల్స్ సాయంతో మరింత స్పెసిఫిక్‌గా సెర్చ్ చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News