కొత్త డిజిటల్ లైఫ్ కోసం ఇలా చేయండి!

స్మార్ట్‌ఫోన్‌ను మనం వాడుకోవడం మాట అటుంచి స్మార్ట్‌ఫోన్ మనతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. రకరకాల రుగ్మతలకు, ఒత్తిడికి స్మార్ట్‌ఫోన్ వాడకమే కారణమవుతుంది.

Advertisement
Update:2022-12-30 16:07 IST

కొత్త డిజిటల్ లైఫ్ కోసం ఇలా చేయండి!

రాబోయే కొత్త సంవత్సరానికి గానూ చాలామంది కొత్త జోష్‌లో రకరకాల రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. అయితే ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డిజిటల్ అడిక్షన్. అందుకే కొత్త ఏడాది డిజిటల్‌ లైఫ్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల లైఫ్‌స్టైల్ మరింత బెటర్‌‌గా మారుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ను మనం వాడుకోవడం మాట అటుంచి స్మార్ట్‌ఫోన్ మనతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. రకరకాల రుగ్మతలకు, ఒత్తిడికి స్మార్ట్‌ఫోన్ వాడకమే కారణమవుతుంది. అందుకే మొబైల్ వాడకం వల్ల ఒత్తిడికి లోనయ్యే వాళ్లు, కంటి సమస్యలతో బాధపడేవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు కొత్త ఏడాది సందర్భంగా డిజిటల్ డీటాక్స్ రెజల్యూషన్ పెట్టుకోవచ్చు.

సోషల్ లైఫ్‌లో బిజీగా ఉండేవాళ్లు అప్పుడప్పుడు డిజిటల్‌ బ్రేక్‌ తీసుకోవడం ద్వారా చాలా రిలీఫ్ అవుతున్నట్టు చెప్తున్నారు. డాక్టర్లు కూడా ఒత్తిడిని తగ్గించుకునేందుకు డిజిటల్ బ్రేక్ తప్పనిసరి అంటున్నారు. కాబట్టి కొత్త ఏడాది నుంచి వారానికొకరోజు లేదా వీలున్నప్పుడల్లా డిజిటల్ బ్రేక్ తీసుకోవాలి అని తీర్మానించుకోవచ్చు. డిజిటల్ బ్రేక్ అంటే మొబైల్, ఇతర సోషల్ మీడియాలకు దూరంగా ఉండడం.

కొత్త సంవత్సరంలో మొబైల్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా డిజిటల్ సేఫ్టీని మరింత పెంచుకోవచ్చు.

ఊరికే ఫోన్ మీదికి మనసు పోకుండా నోటిఫికేషన్లను బ్లాక్ చేయండి. అవసరమైనవి మాత్రమే ఎనేబుల్ చేసి మిగతా వాటిని బ్లాక్ చేయండి.

పడుకునే ముందు, భోజనం చేసేటప్పుడు మొబైల్ వాడకూడదని న్యూ ఇయర్ సందర్భంగా నిర్ణయం తీసుకోండి.

ఫోన్‌లో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ యాప్స్ అలాగే సోషల్ మీడియా యాప్స్ సెట్టింగ్స్‌లో టైం లిమిట్ సెట్ చేసుకోవడం ద్వారా స్క్రీన్ టైంను తగ్గించుకోవచ్చు.

కొత్త సంవత్సరం సందర్భంగా అకౌంట్ పాస్‌వర్డ్‌లు కూడా మార్చేయండి. సాధారణ పాస్‌వర్డ్‌లు మార్చి ఒక క్యాపిటల్ లెటర్, ఒక అంకె, ఒక సింబల్ ఉండేలా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోండి.

Tags:    
Advertisement

Similar News