Best Smart Phones | రూ.35 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రెడ్‌మీ నోట్ 13 ప్రో నుంచి వన్‌ప్లస్ నార్డ్ 3 వరకూ.. ఇవీ డిటైల్స్..!
Best Smart Phones | భారతీయుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. తొలుత ప్రతి ఒక్కరూ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు.
Best Smart Phones | భారతీయుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. తొలుత ప్రతి ఒక్కరూ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు. అటుపై తమ అవసరాలు, స్టోరేజీ కెపాసిటీ, మెరుగైన ఫీచర్లు గల ఫోన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. గతంలో ప్రతి ఒక్కరూ ఎంట్రీ లెవల్ ఫోన్లతోనే సరి పెట్టుకునే వారు. శక్తిమంతమైన ప్రాసెసర్లు, బ్యూటిఫుల్ మూవ్‌మెంట్స్‌ను బంధించేందుకు మెరుగైన కెమెరాలు, రోజంతా సర్వీస్ అందించే బ్యాటరీ వంటీ ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కాస్త ధర ఎక్కువైనా వాటిని కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. దీనికి తోడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కొత్త ఆశలతోపాటు కొత్త అవసరాలు కూడా ముందుకు తోసుకు వస్తున్నాయి. ఈ తరుణంలో రూ.35 వేల లోపు ధరకు లభించే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందామా..!
రెడ్‌మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ ఇలా
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్13 ప్రో+ 5జీ ఫోన్ మార్కెట్లోకి తెచ్ఇచంది. 120 హెర్ట్జ్ కర్వ్‌డ్ డిస్ ప్లేతోపాటు తక్కువ కాంతి ఉన్నప్పుడు మంచి ఫోటోలు తీయడానికి వీలుగా 200 -మెగా పిక్సెల్ కెమెరా సెటప్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 తో సంబంధం లేకుండా న్యూ హైపర్ ఓఎస్ వర్షన్పై పని చేస్తుందీ ఫోన్. ఈ ఫోన్ రూ.29, 999లకే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇలా పొకో ఎఫ్5 5జీ
మరో చైనా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. తన పొకో ఎఫ్5 5జీ ఫోన్ ప్రెట్టీ వైబ్రంట్ విజువాలిటీతో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. గేమింగ్ టూ మల్టీ టాస్కింగ్ కోసం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఏంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఓఐఎస్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. గతేడాది మే 16న మార్కెట్లోకి ఎంటరైన పొకో ఎఫ్5 5జీ ఫోన్ కార్బన్ బ్లాక్, స్నోస్టోర్మ్ వైట్, ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999లకు లభిస్తాయి.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ ధరెంతో తెలుసా..
గత జూలైలో భారత్ మార్కటె్లో ఆవిష్కరించిన చైనా స్మార్ట్ ఫోన్ ఐక్యూ నియో 7 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే విత్ 2400x1080 పిక్సెల్స్ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. పంచ్ హోల్ కటౌట్, స్లిమ్ బెజెఇల్స్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ అడ్రెనో 730 జీపీయూ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్పై పని చేస్తుంది. 5జీ కనెక్టివిటీ గల ఈ ఫోన్ 4జీ ఓల్ట్, వై-ఫై 6, బ్లూ టూత్ వీ 5.3, జీపీఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్, 8 ఎంపీ ఆల్ట్రావైడ్ లెన్స్ సెన్సర్ కెమెరా, 2 మెగా పిక్సెల్స్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ సెన్సర్ కమెరా ఉంటుంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్. గేమర్ల కోసం ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.43,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999లకు లభిస్తుంది. రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ ఇలా
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ మద్దతుతో 6.74 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.30 వేల లోపే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ కెమెరా ఉంటుంది. 80 వాట్ల చార్జింగ్ మద్దుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. చౌక ధరకే వన్ ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ తేవాలని భావిస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్14 వర్షన్పై పని చేస్తుంది.ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ రూ.33,999 పలుకుతుంది. ఐసీఐసీఐ బ్యాక్, సిటీ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2000 వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.