దళిత బంధు విజయ‌గాథకు ఇది నిదర్శనం ...కేటీఆర్ ట్వీట్

ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన ముగ్గురు లబ్ధిదారులు సూదమల్ల రాజేశ్వరి, సూదమల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్యలు గ్రూపుగా ఏర్పడి‘విజయలక్ష్మి ఇండస్ట్రీస్‌’ పేరుతో నిర్మించిన రైస్‌ మిల్లును మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.

Advertisement
Update:2023-03-27 07:50 IST

దళిత బంధు ఆధ్వర్యంలో ఏర్పడిన మొట్టమొదటి రైస్ మిల్లు ఈ రోజు ప్రారంభం కాబోతోంది. లబ్ధిదారులు గ్రూపులుగా ఏర్పడి ఇప్పటి వరకు ఎర్త్‌మూవర్‌లు, హార్వెస్టర్లు, టిప్పర్లు, ఇతర పెద్ద వాహనాలను కొనుగోలు చేసినప్పటికీ, 2021 ఆగస్టులో పథకం ప్రారంభించిన తర్వాత రైస్ మిల్లును ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన ముగ్గురు లబ్ధిదారులు సూదమల్ల రాజేశ్వరి, సూదమల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్యలు గ్రూపుగా ఏర్పడి‘విజయలక్ష్మి ఇండస్ట్రీస్‌’ పేరుతో నిర్మించిన రైస్‌ మిల్లును మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.

రాజేశ్వరి భర్త సురేందర్‌, లింగయ్యలకు లారీలు ఉండగా, విజయ్‌కుమార్‌ గల్ఫ్‌ దేశస్థుడు. పథకంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో ఈ ముగ్గురు కలిసి రూ.30 లక్షలు వెచ్చించి మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. దళిత బంధు కింద మంజూరైన రూ.30 లక్షలతో పాటు (ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు) రైస్‌మిల్లును నెలకొల్పేందుకు బ్యాంకు రుణం కూడా తీసుకున్నారు.

దళిత బంధు లబ్ధిదారు సురేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంతోపాటు మరో 10 మందికి ఉపాధి కల్పించేందుకు రైస్‌మిల్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, ''రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలోని దళితబంధు పథకం విజయగాథకు హృదయపూర్వక అభినందనలు.

ముగ్గురు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్ , లింగయ్య లు వారి డబ్బు 30 లక్షల రూపాయలను పూల్ చేసి, బ్యాంకు రుణాన్ని సేకరించారు. ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలను పొందారు .

T-PRIDE (తెలంగాణ - దళిత పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్ కార్యక్రమం) దాని పేరుకు తగినట్లుగా ఉంది

విజనరీ సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు'' అని కామెంట్ చేశారు.



Tags:    
Advertisement

Similar News