అవకాశం వస్తే కిస్‌, హగ్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేస్తా

కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బందిపడను అన్న రీతూవర్మ

Advertisement
Update:2025-02-23 12:36 IST

'మజాకా' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి నటి రీతూవర్మ సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆన్‌స్క్రీన్‌ ముద్దు సన్నివేశాలకు తాను వ్యతిరేకం కాదన్నారు. అవకాశం వస్తే కిస్‌, హగ్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేస్తానని అన్నారు. ముద్దు సన్నివేశాలకు సంబంధించిన సినిమాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బందిపడను. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా' అని రీతూవర్మ చెప్పారు.

తన గత సినిమా 'స్వాగ్‌' ఫెయిల్యూర్‌పై మాట్లాడుతూ.. ఆ సినిమా అందరికీ సంబంధించినది కాదని మేము ముందు నుంచే అనుకున్నాం. ఆ కథలో ఉన్న తీవ్రత చాలామందికి అర్తం కాలేదు. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే మనం నటించే అన్ని సినిమాలు ప్రేక్షకులు ఆదరించాలని లేదు కదా అన్నారు. ఒక నటిగా ఆసినిమా చేసినందుకు నేను మాత్రం సంతృప్తిగానే ఉన్నాను అన్నారు.

'పెళ్లిచూపులు 2' గురించి మాట్లాడుతూ.. 'పెళ్లిచూపులు' నాకు ప్రత్యేకమైన మూవీ. ఫ్రెండ్స్‌ అంతా కలిసి చిన్న బడ్జెట్‌లో సినిమా చేశాం. ఫలితం ఎలా ఉంటుందనేది మేము ఎప్పుడూ ఊహించలేదు. ఒక మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకంతో దాన్ని పూర్తి చేశాం. రిలీజ్‌ అయ్యాక అది మా అందరి జీవితాలను మార్చేసింది. విజయ్‌ దేవరకొండ ఇంత పెద్ద స్టార్‌ అవుతాడని అనుకోలేదు. కానీ అతను తప్పకుండా సక్సెస్‌ అవుతాడనుకునేదాన్ని. తరుణ్‌ భాస్కర్‌ ప్రస్తుతం 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌ రాస్తున్నారు. 'పెళ్లిచూపులు 2' కూడా ఆయన తెరకెక్కిస్తే బాగుంటుందని నా భావన. అవకాశం వస్తే విజయ్‌, నేను కలిసి యాక్ట్‌ చేస్తామన్నారు. మజాకా సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటించారు. నక్కిన త్రినాథ్‌రావు డైరెక్టర్‌. ఫిబ్రవరి 26న విడుదల కానున్నది.

Tags:    
Advertisement

Similar News